జీవో 259ను సవరించాలె..బోర్వెల్ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలె: ముస్కు అంజిరెడ్డి 

జీవో 259ను సవరించాలె..బోర్వెల్ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలె: ముస్కు అంజిరెడ్డి 

పంజాగుట్ట, వెలుగు: బోర్​వెల్​ రంగాన్ని సంక్షోభంలో పడేసిన జీవో నెం.259ని వెంటనే సవరించాలని తెలంగాణ రిగ్ ఓనర్స్​అసోసియోషన్​అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

పాత బోర్లకు ఉచిత రిజిస్ట్రేషన్, 300 అడుగుల వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలన్నారు. బోరుబావుల తవ్వకాలపై విధించిన ఆంక్షల కారణంగా రిగ్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్న డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, నిర్మాణ రంగంపై ఆధారపడ్డ మేస్త్రీలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.